విషాదం.. నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా మనూరు మండల కేంద్రం శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లి నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను నరసింహారెడ్డి (45), భార్య కృష్ణవేణి (38) ,సంగమేశ్వర్ రెడ్డి (42) గా గుర్తించారు. గాలింపు చర్యల్లో నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదేహాలను బయటకు తీశారు.

నరసింహారెడ్డి భార్య కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. నరసింహారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ జరిగిన సంఘటనను గ్రామస్తులకు చెప్పడంతో అక్కడికి చేరుకొని మృతదేహాలు వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read : 95 లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? ఈసీని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>