కలం, మధిర టౌన్: వాసంశెట్టి అనసూర్యమ్మ సేవలు మరువలేనివని మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల (Judge Deepthi Vemula) అన్నారు. సీనియర్ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు మాతృమూర్తి అనసూర్యమ్మ శుక్రవారం మధిరలోని వాసంశెట్టి కోటేశ్వరరావు నివాసంలో మృతి చెందారు. ఆమె పార్ధవదేహానికి జడ్జి దీప్తి నివాళులర్పించారు.
అనంతరం వాసంశెట్టి కోటేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె వెంట పీపీ భద్రయ్య, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రామరాజు, సీనియర్ న్యాయవాదులు దిరిశాల జగన్మోహన్ రావు, శీలం చెన్నారెడ్డి ఉన్నారు.

