కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో హృదయవిదారక ఘటనా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్కు చెందిన షబానా అనే మహిళను భర్త వదిలేయడంతో, ఆమె ఇళ్లల్లో పనిచేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పోషిస్తోంది. అయితే, ఆమె రెండో కూతురు రుక్సానా (6) పేగు ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. పాపకు వైద్యం చేయించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లి, ఆరేళ్ల చిన్నారిని హుస్సేన్ సాగర్ (Hussain Sagar)లో విసిరేసింది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ ఈ దారుణాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నీటిలోకి దిగి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశాడు. ఆటో డ్రైవర్ చాకచక్యంతో పాప ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

