ప్ర‌జ‌ల కోస‌మే ‘పోలీసులు మీ కోసం’ ప్రోగ్రామ్: ఎస్పీ అఖిల్‌

కలం, ఆదిలాబాద్‌: ప్రజల ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సేవలను అందించేందుకు ‘పోలీసులు మీ కోసం’ (Police Mee Kosam) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) అన్నారు. గురువారం మేడిగూడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, విద్యార్థులకు నిపుణులైన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స, ఆరోగ్య సూచనలు అందించారు.

కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>