అభిజిత్ దిప్కేపై గౌరీ లంకేశ్ సోద‌రి కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ (Gauri Lankesh) సోదరి కవితా లంకేశ్‌ (Kavitha Lankesh) ఎక్స్‌ వేదికగా చేసిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ బెంగ‌ళూరులోని ‘ఫ్రీడమ్‌ పార్క్‌’లో జరిగిన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ క‌వితా లంకేశ్‌ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. గౌరీ లంకేశ్‌ బతికి ఉంటే అభిజీత్‌ దీప్కేను (Abhijeet Dipke) తన దత్తపుత్రుడిగా ప్రకటించేద‌న్నారు. అలాగే కాక్రోచ్ పార్టీని తాను ముందుండి న‌డిపించే వార‌ని చెప్పారు.

అలాగే ఎన్నో సామాజిక అంశాలపై ప్ర‌శ్నిస్తూ, పోరాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిల‌బ‌డుతున్నావంటూ అభిజీత్‌ దీప్కేను కవితా లంకేశ్ అభినందించారు. నీకు అండ‌గా ఉంటాను బిడ్డా అంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. గౌరీ లంకేశ్‌ పేరును ప్రస్తావిస్తూ కవితా లంకేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>