ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కలం, నిర్మల్: టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు (TGRTC Union Elections) కార్మిక శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్‌, భైంసా డిపోల పరిధిలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ జిల్లా అధికారి రాజలింగం తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా డిపోల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ సమయాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. కార్మికులు నిర్ణీత సమయానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>