కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షుడిగా సయ్యద్ గులాం

కలం, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంఐఎం (Karimnagar MIM) పార్టీ అధ్యక్షుడిగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ అతీఫ్ అతినా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నియామక పత్రాలు అందించారు. కరీంనగర్ జిల్లాలో గ్రూపు రాజకీయాలను, వర్గ విభేదాలను పక్కన బెట్టి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు అధ్యక్షుడిగా నియమించడంపై అసదుద్దీన్ ఓవైసీకి గులాం అహ్మద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>