నిర్మల్‌లో వృద్ధుల హక్కులపై న్యాయ అవగాహన

కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో గురువారం న్యాయ అవగాహన కార్యక్రమం (Legal Awareness Program) నిర్వహించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. రవీందర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సీనియర్‌ సిటిజన్లకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, న్యాయ సేవల చట్టం, సీనియర్‌ సిటిజన్ల హక్కులు, వారి సంక్షేమానికి సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు. చట్టపరమైన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>