ప్రలోభాలకు లొంగొద్దు.. బస్సు-నిచ్చెన గుర్తును గెలిపించాలి: పల్లా దేవేందర్ రెడ్డి

కలం, నల్లగొండ: ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతతో పాటు సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయడమే లక్ష్యంగా ఎంప్లాయిస్ యూనియన్ (Employees Union) నాయకత్వంలోని ఐక్య కూటమి పనిచేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, రీజియన్ గౌరవాధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి (Palla Devendar Reddy) స్పష్టం చేశారు. నల్గొండలో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 9న జరిగే ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ బలపరిచిన ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ ఐక్య కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయం అందించాలని దేవేందర్ రెడ్డి కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐక్య కూటమి గెలిస్తే కార్మికులకు న్యాయమైన వేతనాలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, పదోన్నతులు కల్పించడంతో పాటు సిబ్బంది కొరతను నివారించి పనిభారాన్ని తగ్గిస్తామన్నారు.

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య భద్రత కల్పించేందుకు ప్రతి కార్మికుడికి రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని పల్లా దేవేందర్ రెడ్డి (Palla Devendar Reddy) హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల ఉన్నత విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక విద్యా పథకం అమలుకు కృషి చేస్తామన్నారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు పోరాడతామని స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సంస్థ బలోపేతమవ్వడమే కాకుండా, కార్మికులకు పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత, మెరుగైన రవాణా సేవలు సాధ్యమవుతాయని దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సంస్థ మనుగడ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బస్సు-నిచ్చెన గుర్తుపై ఓట్లేసి ఐక్య కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సమావేశంలో జేఏసీ నాయకులు కేఎస్ రెడ్డి, బి. నరేందర్, బి. వెంకటయ్య, టీజే రావు, ఎన్ఆర్సీ రాజు, జమాల్ గౌడ్, దయాకర్, ఏఎల్ స్వామి, వీఎస్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, గులాం రసూల్, అన్వర్, కేఎల్ రెడ్డి, జి. రాజేష్, కిషోర్, సీహెచ్ వెంకన్న, సతీష్, ఇర్ఫాన్, సుక్కు, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Also Read : జీఎస్టీ రేట్లపై కౌన్సిల్ కీలక నిర్ణయాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>