ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు.. చండూరులో కాంగ్రెస్ ఫైర్

కలం, మునుగోడు: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నాయకుల అరెస్టును ఖండిస్తూ చండూరులో కాంగ్రెస్ నాయ‌కులు గురువారం రాస్తారోకో (Congress Protest) నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ ఛైర్మ‌న్ డా.కోడి శ్రీనివాసులు, మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు మేక‌ల సాగ‌ర్‌రెడ్డి, ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ఐత‌రాజు మ‌ల్లేష్‌లు మాట్లాడుతూ.. కేంద్ర‌ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ఎంత‌మాత్రం స‌హించేది లేద‌ని, ఎంత‌కైన పోరాటం చేస్తామ‌ని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఇండియా కూటమి నాయకుల పోరాటాన్ని ఆపలేరని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వీరి కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్ర ఎన్నిక‌ల అధికారి జ్ఞానేష్ కుమార్‌(Gyanesh Kumar)ను వెంట‌నే విధుల నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అక్ర‌మ అరెస్టుల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని, త‌గిన గుణ‌పాఠం చెప్తార‌ని అన్నారు. అర్హులైన వారి ఒక్క ఓటును తొల‌గించినా ఎంత మాత్రం స‌హించేది లేద‌ని, ఉద్య‌మాన్ని ఉదృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పై జరిగిన దాడితో సమానమని మండిపడ్డారు.

ఈ కార్య‌క్ర‌మం(Congress Protest)లో మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ భూత‌రాజు ద‌శ‌ర‌థ, జిల్లా నాయ‌కుడు కాసాల జ‌నార్థ‌న్‌రెడ్డి, కౌన్సిల‌ర్ కోడి సుష్మ‌వెంక‌న్న‌, కాంగ్రెస్ నాయకులు బుర్కల ఎలక్షన్, బొడ్డుపల్లి రాములు, మండ‌ల, ప‌ట్ట‌ణ మ‌హిళా విభాగం అధ్య‌క్షులు పందిరి రాధా, కారింగు ప‌ల్ల‌వి, ఫ‌రీఫ్‌, మొగుదాల వెంక‌న్న‌, కోఆప్ష‌న్ ఖ‌లీలు, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంగెపు శ్రీను, నాయ‌కులు ప‌న్నాల లింగ‌య్య‌, కారింగు రామ్మూర్తి, నేర్ల‌కంటి ర‌వికుమార్, సుజావుదిన్, కన్నేబోయిన నాగరాజు, ఇరిగి వెంకటేశం, గండు వెంకట్ గౌడ్, రమాదేవి, పంగ రామకృష్ణ, బొల్ల జనార్ధన్, స‌త్యం, స‌ర్వేశ చారి, గుయ్యని దశరథ, మాడుగుల నరసింహతదిత‌రులు పాల్గొన్నారు.

Also Read : రీఎంట్రీ అంత ఈజీగా అవలేదు.. భువి కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>