రీఎంట్రీ అంత ఈజీగా అవలేదు.. భువి కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ!

కలం, స్పోర్ట్స్: భారత టీ20 జట్టులోకి భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పునరాగమనం ఏమాత్రం సులువుగా జరగలేదు. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, మైదానానికి దూరంగా పడిన కఠోర శ్రమే ఆయనను మళ్లీ బ్లూ జెర్సీలో నిలబెట్టింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన భువి విజయ ప్రయాణం వెనుక అపరిమితమైన క్రమశిక్షణ దాగి ఉంది. జట్టులో చోటు కోల్పోయినా భువి నిరాశపడలేదు. ఆయన ఫిట్‌నెస్ కోచ్ సూర్య ప్రతాప్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. భువి రోజుకు ఏకంగా 6 నుంచి 7 గంటల సమయాన్ని సాధనకే కేటాయించారు. జిమ్ వర్కౌట్లు, రిహాబ్, బౌలింగ్ ప్రాక్టీస్‌ను నిరంతరం కొనసాగించారు. శరీరంలో కొవ్వు శాతాన్ని 19 నుంచి 14కి తగ్గించి, కండరాల బలాన్ని పెంచుకున్నారు. ఆహారం, నిద్ర, రికవరీ విషయంలో కచ్చితమైన నియమాలు పాటించారు.

ఈ నిశ్శబ్ద పోరాటం మైదానంలో మంచి ఫలితాలను ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ 2026లో 28 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు. ఉత్తరప్రదేశ్, లక్నో జట్లకు నాయకత్వం వహిస్తూ దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు అంచనాలు పెట్టుకోకుండా ప్రతిరోజూ కష్టపడటమే తనను మళ్లీ ముందుకు నడిపించిందని భువి (Bhuvneshwar Kumar) పేర్కొన్నారు. వయసును పక్కనపెట్టి భువి చూపిన పట్టుదలను రైనా, సెహ్వాగ్, శ్రీకాంత్ వంటి మాజీ ఆటగాళ్లు ప్రశంసించారు. ఆయన కొత్త బంతి స్వింగ్ నైపుణ్యం న్యూజిలాండ్ పరిస్థితుల్లో భారత్‌కు కలిసివస్తుందని భావిస్తున్నారు.

Also Read : భార‌త్ జంతు సంర‌క్ష‌ణ విజ‌యాలను కొనియాడాలి: క‌మ‌ల్ హాస‌న్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>