కలం, వెబ్ డెస్క్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో 2026 దసరా నవరాత్రి ఉత్సవాలకు (Navaratri Celebrations) ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మవారు పలు విశిష్ట అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నవరాత్రుల్లో (Navaratri Celebrations) ప్రతి రోజూ అమ్మవారిని ఒక్కో ప్రత్యేక రూపంలో అలంకరించి పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఆలయ అధికారులు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం దర్శన ఏర్పాట్లతో పాటు అవసరమైన సౌకర్యాలపై కూడా దృష్టి సారించనున్నారు.
పది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివచ్చే అవకాశం ఉంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు..
. అక్టోబర్ 11న ఆదివారం బాలా త్రిపురసుందరి దేవి అలంకారం, (లైట్ పింక్ కలర్ చీర)
. అక్టోబర్ 12న సోమవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారం,(ఆరెంజ్ కలర్ చీర)
. అక్టోబర్ 13న మంగళవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం,(యెల్లో శాండల్ వుడ్ కలర్ చీర)
. అక్టోబర్ 14న బుధవారం శ్రీ మహా చండీ దేవి అలంకారం,( రెడ్ కలర్ చీర)
. అక్టోబర్ 15న గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం,(ప్యూర్ గోల్డ్ కలర్ చీర)
. అక్టోబర్ 16న శుక్రవారం శ్రీ సరస్వతి దేవి అలంకారం,(వైట్ కలర్ చీర)
. అక్టోబర్ 17న శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, (పింక్ కలర్ చీర)
. అక్టోబర్ 18న ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకారం,( రెడ్ కలర్ చీర)
. అక్టోబర్ 19న సోమవారం మహిషాసుర మర్దిని అలంకారం,( బ్రౌన్ లేదా రెడ్ కలర్ హ్యాండ్లూమ్ చీర)
. 20న మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, (గ్రీన్ కలర్ చీర)
Also Read : తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!
Follow Us On: Youtube

