సాహిత్యంలో అన్నె కార్సెన్‌కు నోబెల్ పురస్కారం

కలం, వెబ్ డెస్క్: కెనడాకు చెందిన ప్రముఖ రచయిత్రి అన్నె కార్సన్‌ (Anne Carson)కు 2026 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య పురస్కారం (Nobel Prize in Literature) లభించింది. శాస్త్రీయ సాహిత్య సంప్రదాయంతో సృజనాత్మకత, వినోదాత్మకంగా ఉండే ఆమె రచనలు ఆధునిక సాహిత్యానికి కొత్త రూపాన్ని అందించిందని అకాడమీ కొనియాడింది. ఆమె రచనల్లో నిజాయతీ, వినూత్నత ఉంటుందని పేర్కొంది. 1950లో కెనడాలోని టోరంటో సిటీలో జన్మించిన అన్నె కార్సన్ 1981లో ‘ఒడి ఎట్ అమో ఎర్గో సమ్’ పేరిట ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన డాక్టోరల్ థీసిస్ ప్రచురించారు.

అన్నె కార్సన్ (Anne Carson) ఒకవైపు రచనలు కొనసాగిస్తూనే.. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు. కొత్త భాషలను అన్వేషించాలనే పట్టుదల, కొత్త అర్థాలను సృష్టించాలనే తపనలో ఆమెలో చాలా ఎక్కువని ప్రశంసించింది. కొత్త పదాలను పుట్టించడం ద్వారానే తన రచనలను ప్రారంభిస్తుంటానని అన్నె కార్సన్ చెప్పడం ఆమె సాహిత్య వైవిధ్యతను స్పష్టంగా చెబుతోందని అకాడమీ పేర్కొంది.

Also Read : ఈసీ అధికార పార్టీకే అనుకూలం: ప్ర‌శాంత్ కిషోర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>