కలం, స్పోర్ట్స్: టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో జాతీయ జట్టులో అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) అతని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ లాంటి సీనియర్ ఓపెనర్లు ఉండటంతో వైభవ్ తుది జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అతని ప్రతిభను చూసి ఇప్పటికీ ఆకాశానికి ఎత్తేయడం సరైనది కాదని కపిల్ స్పష్టం చేశారు.
ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్ దేవ్(Kapil Dev), వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని అంగీకరించారు. కానీ గతంలో భారీ అంచనాలతో వచ్చి, ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అందులో మాజీ దిగ్గజ బ్యాటర్ వినోద్ కాంబ్లీ ఒకరిని ఉదాహరణగా చెప్పారు. వైభవ్‌కు ఇంకా 15 ఏళ్లే అని, అతనికి మరో మూడేళ్ల సమయం ఇవ్వాలని కపిల్ అభిప్రాయపడ్డారు.
వయసుతో పాటు జీవనశైలి, ఆలోచనా విధానం మారతాయని ఆయన చెప్పారు. మైదానంలో పరుగులు చేయడం కంటే, ఆ తర్వాత వచ్చే మార్పులను ఎలా తట్టుకుంటాడనేదే ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో వైభవ్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. ఆ తర్వాత ఇండియా-ఎ తరుఫున శ్రీలంక-ఎ పై కేవలం 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించారు.
2026 ఐపీఎల్ సీజన్లో పలు రికార్డులతో ఆరెంజ్ క్యాప్ సాధించి జాతీయ టి20 జట్టులోకి వచ్చారు.రోహిత్, విరాట్, సచిన్ లాగా 10 నుండి 15 ఏళ్ల పాటు దేశానికి సేవలందించే క్రికెటర్లే తమకు కావలసిందని కపిల్ వ్యాఖ్యానించారు.
Also Read : రీఎంట్రీ అంత ఈజీగా అవలేదు.. భువి కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ!
Follow Us On: X(Twitter)

