ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కలం, నిర్మల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ హేమలత ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం. సుధాకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యు. గంగాధర్‌ ప్రారంభించారు. విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రదర్శించారు.

అనంతరం సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు ఆలపిస్తూ, కోలాటాలతో సందడి చేశారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. సృజనాత్మకంగా రూపొందించిన బతుకమ్మల్లో ఉత్తమంగా నిలిచిన వాటికి బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం అధ్యాపకులు, విద్యార్థినులకు సంప్రదాయ సత్తుపిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సూర్యసాగర్‌, డాక్టర్‌ పి.జి.రెడ్డి, డాక్టర్‌ టి. శ్రీనివాస్‌, అర్చన, డాక్టర్‌ రజిత, రమేష్‌ రెడ్డి, కుంట శ్రీహరి, దిలీప్‌, డాక్టర్‌ రంజిత్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : జ్ఞానేష్ కుమార్‌కు మాజీ జడ్జిల మద్దతు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>