సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నారా? ఇక భారీ జరిమానాలే!

కలం, నిర్మల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ పట్టణంలోని ప్లాస్టిక్‌, కిరాణా దుకాణాల్లో మున్సిపల్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (Single-Use Plastic) ను వినియోగిస్తున్న దుకాణదారులకు మొత్తం రూ.7 వేల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు మాట్లాడుతూ.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా విరమించుకోవాలని దుకాణదారులకు సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రజిని, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>