మధిరలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు!

కలం, ​మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక లడ్కా బజార్‌లోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఆళ్ల కృష్ణ అధ్యక్షతన, ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు నిర్వహణలో గురువారం నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశం నవంబర్ 15వ తేదీ ఉదయం 10:15 గంటలకు మధిర-వైరా ప్రధాన రహదారిలోని కొండలరావు హాస్పిటల్ సమీపంలో ఉన్న జిలుగుమాడు ఆర్చి రింగ్ సర్కిల్ సెంటర్‌లో రంగా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్నూరు కాపు నాయకులు మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాతను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.

దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ.. విగ్రహావిష్కరణకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>