కలం, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్ల కోసం వైసీపీ (YSRCP) గళమెత్తబోతుంది. ఈ నెల 16న పార్టీ అధినేత జగన్ (YS Jagan) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీ సభ నిర్వహించబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర పార్టీ నేతలు సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయబోతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హై కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో బీసీలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ (YSRCP) ఆరోపిస్తోంది. ఈ సభతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీల నమ్మకాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
Also Read : త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాం : విజయసాయి రెడ్డి
Follow Us On: Youtube

