నిర్మల్‌లో వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం.. కలెక్టర్ కీలక ప్రకటన

కలం, నిర్మల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా ప్రజలు తమ సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఇంటి నుంచే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌ (WhatsApp Grievance Cell) ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా (Collector Bhavesh Mishra) గురువారం తెలిపారు.

ప్రజలు ప్రతి సమస్యకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ వేదిక ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులను 8317557897 వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో పంపవచ్చని తెలిపారు.

ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలను జతచేయాలని సూచించారు. వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ నంబర్‌కు పంపాలని, అనవసరమైన లేదా తప్పుడు సందేశాలు పంపవద్దని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>