కలం, నిర్మల్ : ఢిల్లీలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష(Hunger Strike) చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

