ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ కూటమిని గెలిపించండి : చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy)  కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్ లోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ వద్ద సిరిసిల్ల, వేములవాడ, జోనల్ వర్క్ షాప్ కార్మికులతో చాడ వెంకటరెడ్డి కార్మికులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఫిలిం భవన్ లో జరిగిన కరీంనగర్, వన్, టూ డిపోల కార్మికుల సమా ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఎంప్లాయిస్ యూనియన్ అలాగే టీఎంయూ కూటమి గెలవాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకలను గెలిపించడం ద్వారానే ప్రభుత్వం కార్మికుల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తుందని వెంటకట రెడ్డి (Chada Venkat Reddy) తెలిపారు. భారీ మెజార్టీతో ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కూటమిని గెలిపించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో సిపిఐ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు, ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>