‘బేబీ’ మూవీ కాపీరైట్ కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?

క‌లం, సినిమా: బేబీ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ సాయి రాజేశ్‌ (Sai Rajesh)కు ఓ చీటింగ్ కేసుకు సంబంధించి ఊర‌ట ల‌భించింది. ‘బేబీ’ సినిమా (Baby Movie) కథ తనదేనంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ గతంలో సాయి రాజేష్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌పై చీటింగ్ కేసు న‌మోదైంది. ఈ చీటింగ్ ఆరోపణలను తాజాగా న్యాయస్థానం కొట్టివేసింది. 2013లో తాను చెప్పిన కథనే రాజేష్ ‘బేబీ’గా తీసి మోసం చేశారని శ్రీరామ్ పోలీసులను ఆశ్రయించారు.

2013లోనే రాజేశ్‌(Sai Rajesh)కు ఈ క‌థ చెప్పాన‌ని శ్రీరామ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015లో ‘కన్నా ప్లీజ్’ పేరుతో కథ రాసుకొని ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌ని కూడా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు కాపీరైట్ చ‌ట్టం కింద సాయి రాజేశ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన ఆధారాలు, స్క్రిప్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం ఒకే ఇతివృత్తం ఉండటం లేదా ఒకే నిజ జీవిత ఘటన నుంచి ప్రేరణ పొందడం కాపీరైట్ కిందకు రాదని స్పష్టం చేసింది. దర్శకుడు సాయి రాజేష్ ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు లేదా మోసానికి పాల్పడినట్లు తగిన ఆధారాలు లేవని తేల్చిచెప్పిన న్యాయస్థానం, ఈ విచారణను పూర్తిగా ముగించింది.

Also Read :  ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. వెంకీ ఫ్యాన్స్ ఫైర్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>