గోదావరిలో భద్రాచలం శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన ‘శ్రీరామకోటి’ పుస్తకాలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. స్వామివారి దర్శనానికి వచ్చే అనేకమంది భక్తులు తాము ఎంతో నియమనిష్టలతో రాసిన శ్రీరామకోటి గ్రంథాలను ఆలయంలో సమర్పిస్తుంటారు. అయితే, ప్రస్తుతం భద్రాచలం ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున భక్తులు ఇచ్చే ఈ పుస్తకాలను భద్రపరచడానికి తగినంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది.

​ఈ నేపథ్యంలో ఆలయ వైదిక సిబ్బంది, పండితుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఈ రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని ఆలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి బుధవారం పవిత్ర గోదావరి నదిలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ​ఈ మేరకు గోదావరి నది తీరంలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జన కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు చేపట్టారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి (ఈవో) కె. దామోదర్ రావు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>