యాదాద్రి పవర్ ప్లాంట్.. హరీశ్ రావుకు భట్టి సంచలన సవాల్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ సిబ్బందిని అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చేలా ప్రతిపక్షాలు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ ను బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. పవర్ డిస్కంలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నది ప్రచారమేనని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ తో రాష్ట్రానికి భారం మోపిందని ఆరోపించారు. అసలు బొగ్గు కేటాయింపులు లేకుండా పవర్ ప్లాంట్ ను ఎలా కట్టాలనుకున్నారని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు డీపీఆర్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బొగ్గు లేకుండా పవర్ ప్లాంట్ ను కట్టింది నిజమా కాదా అని నిలదీశారు. పవర్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని హరీశ్ రావు (Harish Rao)కు సవాల్ విసిరారు.

రాజకీయ లబ్ది కోసం హరీశ్ రావు రాష్ట్రానికి నష్టం చేయడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కామన్ సెన్స్ లేకుండా యాదాద్రి ప్లాంట్ విషయంలో దుర్మార్గం చేశారని నిప్పులు చెరిగారు. యాదాద్రి ప్లాంట్ నిర్వహణపై కూడా హరీశ్ రావుకు డిప్యూటీ సీఎం కౌంటర్ వేశారు. నది, నీళ్లు లేకుండా హైడల్ పవర్ ప్రాజెక్ట్ కట్టగలరా? అని ప్రశ్నించారు. యాదాద్రి నిర్మాణం ముగిసేనాటికి కూడా కేటాయింపులపై క్లారిటీ లేదన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>