కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కరువు భత్యం (Telangana DA) బకాయిల విడుదలకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు డీఏలు పెండింగ్లో ఉండగా, ప్రభుత్వం మొదటి విడతగా రెండు డీఏ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం (Telangana Govt) విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2024 జనవరి 1 నుండి వర్తించే మొదటి డీఏ (DA) పెంపు ద్వారా ఉద్యోగుల కరువు భత్యం ప్రాథమిక వేతనంలో 33.67 శాతం నుండి 37.31 శాతానికి పెరగనుంది. అదేవిధంగా, 2024 జూలై 1 నుండి అమలులోకి వచ్చే రెండో డీఏ కింద ఈ భత్యం 37.31 శాతం నుండి 40.04 శాతానికి పెరుగుతుంది. ఈ రెండు పెంపుల ద్వారా ఉద్యోగుల డీఏ మొత్తంగా 6.37 శాతం మేర పెరగనుంది.
ఈ పెంచిన కరువు భత్యాన్ని అక్టోబర్ నెల వేతనంతో కలిపి అందుబాటులోకి తేనున్నట్లు సర్కార్ వెల్లడించింది. బకాయి పడిన మొత్తం నిధులను విడతలవారీగా సంబంధిత ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
Also Read : రేవంత్ రెడ్డి అత్యవసర హస్తిన పర్యటన!
Follow Us On: Youtube

