కలం, నిర్మల్ : వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరించిన బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి (MLA Maheshwar Reddy) విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి భరతమాత చిత్రపటాన్ని అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి బంగల్ పేట్ మహాలక్ష్మీ ఆలయంలో నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు. ఉత్సవాల నిర్వహణకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

