హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్: గీతా హ్యుందాయ్ వద్ద కలకలం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రాజకీయం మరోసారి ఫ్లెక్సీల పోరుతో తీవ్ర రసవత్తరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యర్థి గులాబీ పార్టీ నాయకులు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. హైదరాబాద్ నగరంలోని గీతా హ్యుందాయ్ షోరూమ్ ఎదుట అర్థరాత్రి సమయంలో ప్రత్యక్షమైన ఫ్లెక్సీ (Geetha Hyundai Flexi)లు దుమారం రేపుతున్నాయి. “అర్థమైందా రాజా..” అనే డైలాగ్‌తో సీఎం సతీమణికి చెందినదిగా ప్రచారంలో ఉన్న ఈ షోరూమ్‌ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ “675 ఎకరాలు.. రూ. 8,528 కోట్ల వ్యయంతో చేపట్టే హ్యుందాయ్ ప్రాజెక్ట్‌లో గీతా హ్యుందాయ్ వాటా ఎంత?” అంటూ ఆరోపణలతో కూడిన ప్రశ్నలను ఆ ఫ్లెక్సీలలో ముద్రించారు. సీఎం కుటుంబాన్ని ప్రత్యక్షంగా కార్నర్ చేస్తూ వెలసిన ఈ ఫ్లెక్సీ రాజకీయాలు రాజధానిలో చర్చనీయాంశంగా మారగా, దీనిపై కాంగ్రెస్ శ్రేణులు, బిఆర్ఎస్ వర్గాల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>