కలం, వెబ్ డెస్క్ : యెమెన్ (Yemen)లో సౌదీ అరేబియా మద్దతున్న ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న పోరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో లొంగిపోతున్న వారిపైకి సాయుధ బలగాలు వాహనాలను ఉద్దేశపూర్వకంగా తొక్కించి వేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బాబ్ ఎల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోని కీలక ప్రాంతాలను యెమెన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న క్రమంలో ఈ సంఘటన వెలుగు చూసింది. హౌతీల ఆధీనంలో ఉన్న భూభాగాలన్నింటినీ చేజిక్కించుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు భారీ ఎదురుదాడి ప్రారంభించినట్లు ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియలో గాయపడి నేలపై చేతులు పైకెత్తి పడి ఉన్న పలువురు హౌతీలపైకి ఓ సాయుధ సైనిక వాహనం నేరుగా దూసుకెళ్లడంతో పాటు వారిని తొక్కివేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. మరో వీడియోలో, ప్రాణభయంతో లొంగిపోయేందుకు చేతులెత్తిన క్షణాల్లోనే హౌతీల బృందం పైకి వాహనం దూసుకురావడం, ఆ సమయంలో వాహన డ్రైవర్ “అల్లాహో అక్బర్” అని అరవడం కనిపించిందని ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.
వీడియో గేమ్‌ను తలపిస్తున్న క్రూరత్వం
సౌదీ సైనిక దళాల వాహనం హౌతీ దళాలను వెంటాడి తొక్కించే భయానక దృశ్యాలు ప్రముఖ వీడియో గేమ్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో’ (GTA) లోని గ్రాఫిక్స్ లో కనిపించే విధంగానే ఉన్నాయి. ఈ దాడిపై నెటిజన్లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో లొంగిపోతున్న వారిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం దారుణమని కొందరు మండిపడుతుండగా, మరికొందరు ఈ దృశ్యాలు అచ్చం జీటీఏ గేమ్‌లాగే ఉన్నాయంటున్నారు. యెమెన్‌కు జీటీఏ కొత్త వెర్షన్ ముందస్తు యాక్సెస్ లభించిందంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
@Reuters @timourazhari Saudi-backed forces in Yemen intentionally ran over injured and surrendering fighters with their armored vehicle.
These are the animals the US feels comfortable cooperating with.
Just make sure you understand, who you cheer for. https://t.co/LjJx4AM2Bh
— Tomas Orpington (@TomasOrpington) October 5, 2026

