నౌకపై దాడి.. భారత నావికులకు తీవ్ర గాయాలు!

కలం, వెబ్ డెస్క్: ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 11 మంది భారత నావికులు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ (Ministry Of External Affairs) ప్రకటన విడుదల చేసింది. ‘ఒమన్ తీరంలో హూర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ‘ఎంటీ పీస్’ అనే నౌకపై దాడి జరిగింది. నౌకలో ఉన్న 19 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులున్నారు. వీరిలో 11 మంది భారతీయులు, మరో దేశస్థుడు గాయపడ్డారు. ఒమన్ అధికారులు వెంటనే స్పందించి నావికులను కషబ్ ఆసుపత్రికి తరలించారు. వారికి ధన్యవాదాలు’ అని పేర్కొంది

ఇటీవల నౌకలపై చోటు చేసుకుంటున్న వరుస దాడులు, భారత నావికులు గాయపడుతుంటం ఆందోళనకరమని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం నెలకొనాలంటే ఇలాంటి దాడులను వెంటనే ఆపేయడం ఉత్తమం. వాణిజ్య, ప్రయాణికులతో వెళ్లే నౌకలపై దాడులకు వెంటనే ముగింపు పలకాలి. అంతర్జాతీయ సముద్ర జలాల్లో సురక్షితంగా ప్రయాణాన్ని పునరుద్దరించే చర్యలు చేపట్టాలి’ అని ప్రకటనలో పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>