ఏపీ అధికారుల మెరుపు ఆపరేషన్.. పాక్ స్పై నెట్‌‌వర్క్ గుట్టురట్టు!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు నేవి రక్షణ రంగాన్ని (Navy Spying Racket)
లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ పాకిస్తాన్ గూఢచార్య నెట్ వర్క్‌ను ఛేదించారు. ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ కోసం 12 ఇంటెలిజెన్స్ బృందాలు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో భాగాంగా 18 మందితో కూడిన గూఢచారి వ్యవస్థను గుర్తించగా, అందులో 13 మంది నేవీ సిబ్బంది అనుమానితులుగా తేలారు. నిందితులు ఎంక్రిప్టెడ్ సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా భారత రక్షణ, నేవీ విభాగాలకు చెందిన వ్యూహాత్మక రహస్య సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేస్తున్నట్లు అధికారులు తేల్చారు.

ఈ ఆపరేషన్‌లో ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఇద్దరిని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరులో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీతో పాటు కాంట్రాక్ట్ డ్రైవర్ సాయివరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన సాయివరప్రసాద్‌కు న్యాయస్థానం ఈ నెల 14 వరకు రిమాండ్ విధించడంతో అతడిని విశాఖపట్నం జిల్లా జైలుకు తరలించారు. సోదాల సమయంలో నిందితుల నుంచి పలు కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. మిగిలిన 16 మంది అనుమానితుల పాత్రపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>