కలం, వరంగల్: వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలో నిలిచిపోయిన అండర్ డ్రైనేజ్ పనులను వెంటనే ప్రారంభించాలంటూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం (BJP Protest) నిర్వహించారు. పనులు జరగకుండా స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల, పాలకుల తీరుకు నిరసనగా బీజేపీ నాయకలు, కార్యకర్తలు రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేసి తమ నిరసనను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవి,స్థానిక డివిజన్ నాయకులు, భారీ సంఖ్యలో జిల్లా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివనగర్ అండర్ డ్రైనేజ్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

