కలం, కరీంనగర్ : ప్రజలకు మేలు చేయడంతో పాటు వైవిధ్యభరితమైన, సమర్థవంతమైన పాలన అందించడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) అన్నారు. సోమవారం మానకొండూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి మేధావులు, సమర్థులైన ప్రధానులను అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్సింగ్ వంటి ప్రధానులు తమదైన పాలనా ముద్ర వేశారని సత్యనారాయణ (MLA Kavvampalli) గుర్తుచేశారు. అయోగ్యుల పాలనలో దేశం అధోగతి పాలవుతుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
కార్యక్రమంలో నాయకులు ద్యావ శ్రీనివాసరెడ్డి, నందగిరి రవీంద్రచారి, తాళ్లపల్లి సంపత్‌గౌడ్, ప్యాక్స్ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, గంగుల రామిరెడ్డి, పెంచాల కిషన్‌రావు, మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్‌రెడ్డి, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, మీస సత్యనారాయణ, ఎడ్ల సత్యనారాయణ, బుర్ర శ్రీధర్‌గౌడ్, బోళ్ల మురళీధర్, గొల్లెన కొమురయ్య, మ్యాడ తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్, బొట్ల కిషన్, కిశోర్, కనకం సంపత్, దూలం దేవేంద్ర, కొత్తకొండ శంకర్, బుర్ర శ్రీకాంత్, కనకం అశోక్, కోండ్ర సురేష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

