ఖ‌మ్మంలో క‌బ్జాలు, దౌర్జ‌న్యాలు ఉండ‌వు: మంత్రి తుమ్మ‌ల‌

​కలం, ఖమ్మం బ్యూరో: నగరంలో కబ్జాలు, దౌర్జన్యాలు, పోలీస్ కేసుల ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. పేదరికం నుంచి శాశ్వత విముక్తి పొందేందుకు విద్య ఒక్కటే మార్గమని, అందుకే నగరంలో కొత్తగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’, మోడల్, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25 లక్షలు వెచ్చిస్తోందని వెల్లడించారు.​సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్‌లో రూ.1.80 కోట్ల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, రేషన్ కార్డులు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు పారదర్శకంగా అందాలని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో గుడిసెల వాసులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాబోయే దసరా పండుగకు మహిళలకు ముఖ్యమంత్రి కానుకగా చిలకపచ్చ చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మున్సిపల్, సివిల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>