‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. వెంకీ ఫ్యాన్స్ ఫైర్!

కలం, సినిమా: త్రివిక్రమ్–విక్టరీ వెంకటేశ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ (Adarsha Kutumbam AK47) మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా.. ఇంకా బెటర్ అవుట్ పుట్ ఇవ్వాలనే యోచనతోనే వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వెంకటేశ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, ఆయన రాగానే చర్చించి విడుదల తేదీని ఖరారు చేస్తామన్నారు. అభిమానులు క్షమించాలని కోరారు.

కాపీ అప్డేట్ తెలుసుకోకుండా.. ముందే విడుదల డేట్ ప్రకటించడం తన తప్పేనని నాగవంశీ అన్నారు. విడుదలకు నాలుగు రోజుల ముందు వాయిదా వేయడం కరెక్ట్ కాకపోయినా.. కానీ తప్పడం లేదన్నారు. ఇంకా రెండు సెట్ సాంగ్స్ షూట్ ఉందని.. ట్రైలర్ కూడా కట్ చేయాల్సి ఉందన్నారు. తమన్, త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారని.. ట్రైలర్ కట్ చేద్దామన్నా సమయం సరిపోవడం లేదన్నారు. కంగారుగా విడుదల చేయడం కంటే.. ఆలస్యమైనా మంచి కంటెంట్ ఇవ్వాలనేదే తమ ఉద్దేశమన్నారు.

ఎన్నిసార్లు వాయిదా వేస్తారు..?

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ దసరాకు వస్తుందని ముందే చెప్పడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తీరా మరోసారి వాయిదా పడటంతో నిరుత్సాహపడుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీకి విడుదల మార్చారని.. ఇప్పుడు మరోసారి వాయిదా వేయడంపై వెంకీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మూవీ అవుట్ పుట్ చూసిన తరువాత కొన్ని సీన్లను మళ్లీ తీశారని.. అందుకే ఆలస్యమవుతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’ పాట కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. బజ్ క్రియేట్ చేయడానికి కాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నారని చర్చ జరుగుతోంది. త్వరలోనే ట్రైలర్ విడుదల, మళ్లీ ప్రమోషన్స్ చేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>