కలం, వెబ్ డెస్క్ : దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆకాంక్షించారు. సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పండుగ బోనస్ ప్రకటించిన వేళ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు.
దేశానికి వెలుగులు పంచేందుకు కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల (Singareni Workers) శ్రమ వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి కొనియాడారు. సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అని తెలిపారు. లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణి దేశాభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి అని ఆయన (Kishan Reddy) వెల్లడించారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సంస్థ భవిష్యత్తు కోసం యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తుకు అనుగుణం బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆయన సూచించారు.
Also Read : సీఈసీ తొలగింపు పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On: X(Twitter)

