విద్యార్థి నరేందర్‌కు అండగా బీర్ల ఐలయ్య.. రూ. 50 వేల తక్షణ సాయం

కలం, నల్లగొండ: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) తక్షణ ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నాగార్జునసాగర్ గురుకుల పాఠశాల మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన విద్యార్థి ఆవుల నరేందర్… ఎల్బీనగర్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు.

విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతున్న నరేందర్‌ను పరామర్శించి, అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే… తక్షణ సాయంగా రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. విద్యార్థి నరేందర్ సంపూర్ణంగా కోలుకునే వరకు అన్ని విధాలా అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>