ఉద్యోగ దరఖాస్తుకు చివరిరోజు.. నిర్మల్‌లో అభ్యర్థుల అవస్థలు!

కలం, నిర్మల్: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులకు (Job Aspirants) సోమవారం నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ (Nirmal Collectorate) వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణకు సోమవారం చివరి రోజు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అయితే అదే సమయంలో కలెక్టరేట్‌లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో అభ్యర్థులను లోనికి అనుమతించలేదు.

దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దే వేచి ఉండాల్సి వచ్చింది. చివరి రోజు కావడంతో తమ దరఖాస్తులు ఎలా సమర్పించాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఇబ్బందులపై పోలీసు అధికారులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రాజేందర్‌కు సమాచారం అందించారు. అనంతరం కలెక్టరేట్‌ బయట ప్రత్యేకంగా టెంట్‌ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించేలా చర్యలు చేపట్టారు. దీంతో అభ్యర్థులు ఎండలోనే క్యూలో నిలబడి దరఖాస్తులు సమర్పించాల్సి వచ్చింది. ఉద్యోగం కోసం ఆశగా వచ్చిన అభ్యర్థులకు చివరి రోజు ఇలా అవస్థలు తప్పకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>