నందిపేటలో ‘ఛలో OU’ పోస్టర్ల ఆవిష్కరణ.. పైడాకుల కీలక పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈనెల 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ఎంఎస్ఎఫ్ (మాదిగ విద్యార్థి సమాఖ్య ) జాతీయ మహాసభ పోస్టర్లను నందిపేటలో ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ నందిపేట్ మండల నాయకులు, MSF నాయకులు ” ఛలో ఉస్మానియా యూనివర్సిటీ” (Chalo OU) కార్యక్రమంలో పాల్గొని “మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభ” ను విజయవంతం చేయాలని నందిపేట్ మండల డోకేశ్వర్ ఉమ్మడి మండలాల ఇంచార్జ్ పైడాకుల ప్రశాంత్ మాదిగ కోరారు.

నందిపేట్ మండల కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న అన్ని కళాశాలల్లో తక్షణమే ఎంఎస్ఎఫ్ కమిటీల నిర్మాణాన్ని చేపట్టాలని, ప్రతి మండలం నుండి అధిక సంఖ్యలో విధ్యార్ధిని, విధ్యార్ధులను ‘ఛలో హైదరాబాద్’కు తరలించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో MSF జిల్లా కో ఇంచార్జ్ కనక శ్రీదిప్ మాదిగ, విద్యార్థులు నితిన్, కృష్ణ, ప్రవీణ్, వికాస్, అనిల్, అలీ, నాగేష్, నరేష్, భూమేష్ పాల్గొన్నారు.

Also Read : సీఎం రేవంత్, సినీ నటిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>