చెర్వుగట్టులో ఉచిత కంటి పరీక్షల శిబిరం

కలం, నార్కెట్‌పల్లి: కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ చైర్మన్‌, ప్రముఖ ప్రజా గాయని వేముల పుష్ప సూచించారు. నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు (Cheruvugattu) గ్రామంలో ఉద్దీపన ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ప్రాథమిక కంటి పరీక్షల శిబిరాన్ని(Free Eye Screening Camp) ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వేముల పుష్ప మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతోనే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో వైద్య నిపుణులు గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>