ఇరానీ కప్‌లో ఇరగ్గొట్టిన టీమిండియా

కలం, స్పోర్ట్స్​ : ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ (Irani Cup) ను రెస్ట్ ఆఫ్ ఇండియా కైవసం చేసుకుంది. రంజీ ఛాంపియన్ జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల తేడాతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల పట్టుదల, పోరాట పటిమను కొనియాడాడు. రెండేళ్ల విరామం తర్వాత ట్రోఫీని గెలవాలనే పట్టుదలతోనే జట్టు ఆడిందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కాశ్మీర్ 41 పరుగుల ఆధిక్యం సాధించినా రెస్ట్ ఆఫ్ ఇండియా పట్టు వదలకుండా పోరాడిందని చెప్పాడు.

279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్‌ను నాలుగో రోజు రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు 111 పరుగులకే కుప్పకూల్చారు. జట్టులో ప్రతి ఒక్కరు విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారని పంత్ అభినందించారు. ఈ విజయం కెప్టెన్ రిషభ్ పంత్ 29వ పుట్టినరోజు నాడే రావడం విశేషం. సహచర ఆటగాళ్లు తనకు అద్భుతమైన పుట్టినరోజు కానుక ఇచ్చారని పంత్ ఆనందం వ్యక్తం చేశారు.

అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌ (Irani Cup) లో పంత్ పెద్దగా రాణించలేదు. జ్వరం వల్ల నాలుగో రోజు ఆయన ఫీల్డింగ్‌కు రాకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్ బర్త్‌డే వేడుకలను జట్టు సభ్యులు ఘనంగా నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>