కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీతం పెంచుతామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీర కార్మికులకు ఇచ్చిన హామీ అమలు నీటిమీద రాతేనా అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోపారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత, జీవో 60 ప్రకారం జీతాల చెల్లింపు అందని ద్రాక్షగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత తప్పిదాలను పరిష్కరించాల్సిన ఉన్నత అధికారులు, వైద్యశాఖ అధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందిపై అవాకులు చవాకులు పేలడం బాధాకరమని అన్నారు. 650 పడకల సామర్థ్యం జనరల్ ఆసుపత్రికి కేవలం 450 పడకల సామర్థ్యానికి మాత్రమే కాంట్రాక్టు సిబ్బందికి బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయని అన్నారు.
గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆసుపత్రిలో ఎన్నో కొత్త వార్డులు, ఆధునిక సర్జరీ థియేటర్స్, నూతన భవనాలు పడకల పెంపు జరుగుతున్న కార్మికులు మాత్రం క్రితం నియమించిన వారు తప్ప కార్మికుల సంఖ్య పెంపునకు నోచుకోలేదని అన్నారు. పనిచేయడం లేదని నిరాధరా ఆరోపణలు చేస్తూ విధుల నుండి తొలగిస్తామనే అధికారుల వేధింపులతో తీవ్రమైన మానసిక గురవుతున్నారని అన్నారు. జీవో 60 ప్రకారం సాయి సెక్యూరిటీ ఏజెన్సీ జీతాలు చెల్లించడం లేదని ఇచ్చిన సమ్మె నోటీసులు భాగంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగా అజ్మీర్ నేతృత్వంలో ఏప్రిల్ మాసంలో జరిపిన జెయింట్ చర్చల్లో 500 వేతనం పెంచటానికి అంగీకరిస్తామని తెలిపారని చెప్పారు.
అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం మే డే వేడుకల్లో బహిరంగంగా ప్రకటించిన నేటికీ వేతన పెంపు హామీ అమలు జరగటం లేదని వాపోయారు. ఎన్నిసార్లు ఏజెన్సీకి అధికారులకు కలుస్తున్న అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదని అన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మికుల పట్ల వేధింపులు ఆపాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలుపుటకు చింతిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు రంగన్న, మొగులయ్య, బాలకోటి, బాలరాజ్,యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, మన్యం, వెంకటన్న, నరేష్,శంకర్, కృష్ణ,మహేష్,శ్రీశైలం, దేవి, సువర్ణ,అంజమ్మ, వెంకటమ్మ,శిరీష, సరోజ,నిర్మల,జ్యోతి, భాగ్యలక్ష్మి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

