ఓట్ల కోసం వాడుకున్నారు.. ఇప్పుడు ముంచేశారు : కవిత

కలం, వెబ్ డెస్క్ : నేరెళ్ల బాధితుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) ఆరోపించారు. గతంలో బాధితుల దుఃఖాన్ని రాజకీయంగా వాడుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు వారిని బాధితులు అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.

సిరిసిల్ల వేదికగా జరిగిన సభలో బాధితులకు కేవలం రూ.10 లక్షలు, రూ.5 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో హింసకు గురైన బాధితులకు, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్లలోని ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, మూడు ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం అందించినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందని కవిత స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>