డిపాజిట్లు, రుణాలపై పీఏసీఎస్‌లకు కలెక్టర్ సూచనలు

కలం, ఆదిలాబాద్: పీఏసీఎస్‌లు ఆర్థికంగా బలోపేతం (PACS Business Growth) అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, ఆర్థిక స్థితిగతులు, పీఏసీఎస్‌ల ద్వారా అందిస్తున్న సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాల పురోగతిపై సమీక్షించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంఘాల వ్యాపార వృద్ధిని మరింత పెంచేలా ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు. వ్యాపార వృద్ధిలో భాగంగా డిపాజిట్లు, రుణాల మంజూరు తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రూ, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, డీసీసీబీ సీఈఓ ఆర్. చండి విశ్వేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>