బాసరలో పుష్కర వైద్య సేవలపై రవీంద్ర నాయక్ సమీక్ష

కలం, బాసర : పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ (Ravindra Naik) పరిశీలించారు. శనివారం బాసరలో(Basara) పర్యటించిన ఆయన భక్తుల ఆరోగ్య భద్రతకు సంబంధించి వైద్య సదుపాయాలు, అత్యవసర చికిత్స ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వెంటనే చికిత్స అందించేలా అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>