సంగారెడ్డిలో నకిలీ ఆయిల్ దందా.. సంస్థ లైసెన్స్​ రద్దు!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) పట్టణంలోని నాల్సాబ్‌ గడ్డ కాలనీలో టీజీ సేఫ్​ (TG Safe) అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నకిలీ ఎడిబుల్ ఆయిల్ (Fake Edible Oil) వ్యవహారం బయటపడింది. శనివారం టీజీ సేఫ్​ అధికారులు , అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత శ్రీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజేశ్వర్​తో కూడిన బృందం నాల్సాబ్ గడ్డలోని గ్లోబల్ ట్రేడర్స్​ సంస్థపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ భారీ మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు.

సాధారణ సోయాబీన్ ఆయిల్‌ను సేకరించి, దానిని హెల్త్​ ప్లస్​ రీ ఫైన్​డ్​ ఆయిల్​ పేరిట రీప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. రీప్యాక్ చేస్తున్న వంటనూనెల నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవసరమైన ఇన్-హౌస్ ల్యాబొరేటరీ సదుపాయం ఆ సంస్థలో అసలు లేదని గుర్తించారు. నాణ్యతా లోపాలు ఉన్న ఉత్పత్తులను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకునేందుకు సరిపడా ‘రీకాల్ మెకానిజం’ వ్యవస్థ కూడా సదరు సంస్థ వద్ద అందుబాటులో లేదు.

సంస్థ FSSAI లైసెన్స్​ రద్దు

ఆయిల్ కల్తీ, తప్పుడు బ్రాండింగ్ రూపంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవ్వడంతో అధికారులు సదరు సంస్థ FSSAI లైసెన్స్‌ తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఆయిల్ రీప్యాకింగ్ కార్యకలాపాలన్నింటినీ తక్షణమే నిలిపివేశారు. అనంతరం అక్కడ లభించిన వివిధ రకాల ఎడిబుల్ ఆయిల్స్ నుంచి 3 ఎన్‌ఫోర్స్‌మెంట్ శాంపిళ్లను సేకరించి, ప్రయోగశాల పరీక్షల నిమిత్తం ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, సంబంధిత నిబంధనల ప్రకారం నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>