రాచ‌ల బ‌డికి మాజీ మంత్రి సొంత నిధుల‌తో టీచ‌ర్లు!

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: సొంత ఊరిలో స‌ర్కారు బ‌డి పిల్ల‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను చూడ‌లేక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ఉపాధ్యాయుల కొర‌త‌తో చ‌దువుల‌కు ఆటంకం క‌లుగుతుండ‌టంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న సొంత నిధుల‌తో స్కూల్లో ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌ను తాత్కాలికంగా నియ‌మించారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచల (Rachala) శ్రీనివాస్ గౌడ్ సొంత ఊరు. ఇక్క‌డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. దీంతో గత రెండు నెలలుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విష‌యం శ్రీనివాస్ గౌడ్ దృష్టికి వ‌చ్చింది.

దీంతో అదే పాఠశాలలో పని చేసి ప‌దవీ విర‌మ‌ణ పొందిన‌ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు బస్వరాజుని, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు వసంతను తన సొంత ఖర్చుతో వేతనాలు చెల్లిస్తూ మ‌ళ్లీ నియమించారు. ప‌దో తరగతి చదువుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ను శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. అలాగే విద్యార్థులు సులభంగా ఇంగ్లీష్ మాట్లాడేలా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ పెంపొందించుకునేలా ఇంగ్లీష్ ప్రొఫెసర్ రామేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తానని తెలిపారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌కు అవసరమైన సామాగ్రి, కంప్యూటర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సైన్స్ ల్యాబ్ సామాగ్రితో పాటు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్ రాజ గౌడ్, ఉపాధ్యాయులు రాజవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>