వైజాపూర్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కలం, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ (Gudihatnoor) మండలం వైజాపూర్ గ్రామంలోని (Vaijapur village) మండల పరిషత్ ప్రాథమిక (MPPS) ప్రీ-ప్రైమరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చిన్నారులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్, ఎస్పీ వారి విద్యా నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ చిన్నతనంలోనే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, డీఎంహెచ్‌ఓ సాధన, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, స్థానిక సర్పంచ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>