ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అమాన్ అద్భుత విజయం..!

క‌లం, స్పోర్ట్స్​: ఆసియా గేమ్స్ 2026 పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం నాగోయాలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత రెజ్లర్ అమాన్ షెహ్రావత్ (Aman Sehrawat) అద్భుత విజయాన్ని సాధించారు. ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ హన్ చోంగ్ సాంగ్‌ను 11-7 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. గత 2022 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌లో కాంస్యం గెలిచిన అమాన్‌‌కు ఈ విభాగంలో ఇది రెండో పతకం కావడం విశేషం.

ఈ ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచీ ఎంతో ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ప్రారంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడినప్పటికీ అమాన్ పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. అమాన్ ప్రత్యర్థి దాడిని సమర్థంగా అడ్డుకుంటూ హాఫ్ టైమ్ తర్వాత వరుస పాయింట్లతో 6-1తో ముందుకు దూసుకెళ్లారు. అయితే ప్రత్యర్థి తీవ్రంగా విరుచుకుపడి వరుసగా ఆరు పాయింట్లు సాధించడంతో అమాన్ 6-7తో వెనుకబడ్డారు.

ఆ తర్వాత అమాన్ పట్టుదలతో పోరాడి కీలకమైన నాలుగు పాయింట్లు సాధించి మళ్లీ గేమ్‌లోకి వచ్చారు. ప్రత్యర్థి చేసిన ఛాలెంజ్ విఫలం కావడంతో అమాన్‌కు మరో పాయింట్ లభించింది. మ్యాచ్ ముగియడానికి నిమిషం కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు అమాన్ ప్రత్యర్థిని కిందకు దించి మళ్లీ పాయింట్ సాధించారు. ఆఖరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని 11-7తో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. శుక్రవారం 65 కేజీల విభాగంలో సుజీత్ కల్కల్ పసిడి నెగ్గగా, ఈ ఆసియా గేమ్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్‌కు లభించిన రెండో స్వర్ణం ఇది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>