అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార అవగాహన కార్యక్రమం

కలం, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవంలో భాగంగా శనివారం రోజున పోషకాహారంపై అవగాహన కార్యక్రమం (Nutrition Awareness Program) నిర్వహించారు. ప్రోగ్రామ్ సందర్భంగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి, పోషకాహారంపై అవగాహన కల్పించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ , అంగన్వాడీ టీచర్ జమీన, తల్లులు, ఏఎన్ఎం స్వరూప, ఆశ, ఆయా తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>