బొల్లారం ఆయుధాల చోరీ కేసు: కీలక విషయాలు వెల్లడించిన సీపీ సుమతి

కలం, వెబ్ డెస్క్ : బొల్లారం సైనిక స్థావరంలో జరిగిన ఆయుధాల చోరీ (Bollarum Arms Theft) కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌తో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ సుమతి వెల్లడించారు. విచారణ నిమిత్తం మల్లేశ్‌ను పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన గన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2010లో మల్లేష్‌ ఆర్మీలో చేరాడు. ఆ తర్వాత 2025లో సికింద్రాబాద్ రెజిమెంట్‌కు పోస్టింగ్ రాగా, మోకాలి గాయం కారణంగా ఇటీవల తన సర్వీస్‌ను ముగించాడు. అయితే, మల్లేశ్‌కు సంబంధించి పూర్వ నేరచరిత్రను పరిశీలించగా, గతంలో కూడా అతడిపై రెండు చోరీ కేసులు ఉన్నట్లు తేలింది.

సర్వీస్ ముగిసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మల్లేష్, వాటి నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున చోరీలకు పథకం వేశాడు. గోల్డ్ షాపులు, బ్యాంకుల్లో భారీ దోపిడీలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆయుధాల చోరీకి పూనుకున్నాడు. ఇందులో భాగంగా మల్లికార్జున, నిరంజన్‌లతో కలిసి ప్లాన్ రూపొందించాడు. కాగా, ఈ చోరీ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>